![]() |
![]() |
.webp)
ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఈ వారం షో ఫుల్ ఎంటర్టైనింగ్ గా సాగింది. ఇక ఇందులో శ్రీముఖి బాలుతో చేసిన చిలిపి చేష్టలూల్ భలే ముద్దుగా ఉన్నాయి. ఐతే ఒక విషయంలో శ్రీముఖి బాధపడింది. దాన్ని తీర్చడానికి మధ్యవర్తిత్వం చేయడానికి కార్తీక దీపం డాక్టర్ బాబుని పిలిచింది. ఐతే ముందుగా శ్రీముఖి వెళ్లి బాలుతో డాన్స్ చేసింది దాంతో బాలు శ్రీముఖిని లిఫ్ట్ చేయడానికి ట్రై చేసాడు. వెంటనే అవినాష్, హరి వచ్చి అడ్డుపడ్డారు. "అందరూ నన్నే అంటున్నారు. నువ్వే బాలు మీద ఇంటరెస్ట్ చూపిస్తున్నావు అని కాబట్టి ఈ పంచాయతీ తీర్చాలి.
మీరే దగ్గరుండి మాట్లాడి ఐ లవ్ యు " చెప్పించండి అంటూ శ్రీముఖి సిగ్గుతో డాక్టర్ బాబుని అడిగింది. "బాలు నువ్వు ముందు శ్రీముఖిని లిఫ్ట్ చేసే బదులు వెళ్లి ఆ మూడు ముక్కలు చెప్పేయ్" అన్నాడు. ఇక శ్రీముఖి కూడా "ఆ త్రి మ్యాజికల్ వర్డ్స్ ఐ లవ్ యు చెప్పేసేయ్ " అని అంది. తర్వాత ఇద్దరూ కలిసి "సామజవరగమనా" అనే సాంగ్ కి డాన్స్ చేశారు. ఐతే శ్రీముఖి బాలును తెగ గడ్డాలు, బుగ్గలు పట్టుకుంటూ ఉండేసరికి "నువ్వెందుకు ముందే వచ్చేస్తున్నావ్ అలా లాగేయకు బాలుని" అన్నాడు డాక్టర్ బాబు. దాంతో శ్రీముఖి నవ్వేసింది. శ్రీముఖి-బాలు మధ్య ఏదో ఉంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఏ షో ఐనా కానీ సైలెంట్ గా ఉన్న వాళ్ళను చూసి వాళ్ళతో నవించడానికి షోని రక్తి కట్టించడానికి శ్రీముఖి వాళ్ళతో ఇలా లవ్ గేమ్స్ ఆడిస్తూ ఉంటుంది.
![]() |
![]() |